టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. చిరు 153వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని పెంచుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయాలని ఫిక్సయ్యారు మేకర్స్. అయితే తాజాగా సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ పుకార్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ నిరాశలో ఉన్న అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. గాడ్‌ఫాదర్ అనుకున్న తేదీనే విడుదలవుతుందని, పుకార్లను పట్టించుకోవద్దని స్పష్టం చేశారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి మరోవైపు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు బాబీ డైరెక్షన్లో 154వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.