స్టార్ కాంబినేషన్ సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2)తో అలరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొత్త అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారి కోసం ఓ అప్డేట్ వచ్చేసింది.
బన్నీ కోసం డిఫరెంట్ లుక్స్ ను ప్రయత్నిస్తున్నారట. ఇటీవలే హీరో అల్లు అర్జున్ లుక్ ట్రయల్ కూడా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. పుష్ప 2లో బన్నీ, రష్మిక కొత్త లుక్‌లో కనిపిస్తారా..? అన్న ప్రశ్నపై నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ (Y Ravi Shankar)మాట్లాడుతూ..రెండు రోజులుగా అల్లు అర్జున్, ప్రీతిషీల్ (మేకప్-ప్రోస్థటిక్ లుక్ డిజైనర్ ) డిఫరెంట్ లుక్స్ ను ప్రయత్నిస్తున్నారు. ఆ లుక్ ఏంటనేది లాక్ చేశారు. ప్రీతిషీల్ పార్టు 1కు కూడా పనిచేశారు. కచ్చితంగా సీక్వెల్లో హీరో లుక్ ఫస్ట్ పార్టును మించి రఫ్‌గా ఉంటుందన్నారు.
బన్నీ పార్టు 1లో ఉన్న లుక్‌లోనే కనిపిస్తాడు కానీ కొన్ని మార్పులు చేయడం జరిగిందని చెప్పారు నిర్మాత రవిశంకర్. సెప్టెంబర్ 22 నుంచి షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హైదరాబాద్‌లో మొదలవుతుంది. సాయిపల్లవి సీక్వెల్లో కనిపించబోతుందని వచ్చిన వార్తలపై అలాంటిదేమి లేదు..ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.
పుష్ప..ది రైజ్ బాక్సాపీస్ ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు బ్లాక్ బాస్టర్ హిట్టయ్యాయి. సీక్వెల్‌కు కూడా అదిరిపోయే పాటలు సిద్దం చేసింది డీఎస్పీ టీం.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?