Trisha | సాధారణంగా సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద స్టార్ యాక్టర్ల సినిమాల సందడి ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఒకే టైం స్టార్ హీరోల సినిమాల రిలీజవడం చూస్తుంటాం.. కానీ స్టార్ హీరోయిన్ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం అరుదుగా కనిపిస్తుంటుంది. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరనే కదా మీ డౌటు. ఇంకెవరో కాదు చెన్నై సుందరి త్రిష (Trisha).
ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. త్రిష మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభరలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు అజిత్ కుమార్ నటించిన విదాముయార్చిలో హీరోయిన్గా నటిస్తోంది. విశ్వంభర జనవరి 10న విడుదల కానున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరోవైపు విదాముయార్చి జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే నిజమైతే ఒకే సారి త్రిష నటించిన ఈ రెండు సినిమాల మధ్య పోరు ఉండనుందన్నమాట. మరి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రం.. రెండు సినిమాల మధ్య ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారనుంది.
త్రిష మరోవైపు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న థగ్ లైఫ్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. థగ్ లైఫ్ షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే బృందా వెబ్ ప్రాజెక్ట్‌తో సూపర్ సక్సెస్ అందుకుంది త్రిష. ఈ భామ మలయాళంలో ఐడెంటిటీ సినిమా చేస్తోంది. దీంతోపాటు మోహన్‌లాల్ నటిస్తోన్న రామ్‌లో హీరోయిన్గా నటిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు