SHAMBHALA |టాలీవుడ్ యాక్టర్ ఆదిసాయికుమార్ (Aadi Saikumar) నటిస్తోన్న తాజా చిత్రం శంబాల (SHAMBHALA). ఈ చిత్రానికి ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు. అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది.
వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లు పంపిణీ చేస్తున్నాయి. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ విడుదల చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాల్లో ఉషా పిక్చర్స్, విదేశీ మార్కెట్, కర్ణాటకలో మూన్‌షైన్ సినిమాస్, కుమార్ బెంగళూరు ఫిలిమ్స్ ఓవర్సీస్లో విడుదల చేయనున్నాయి. శంబాల చిత్రాన్ని టాప్ కంపెనీలు విడుదల చేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో లబ్బర్ పండు ఫేం స్వసిక, రవి వర్మ, మధునందన్, శివ కార్తీక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా శంబాల ఓటీటీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా దక్కించుకోగా.. తెలుగు శాటిలైట్ రైట్స్‌ను జీ దక్కించుకుంది. ఇప్పటికే ఆది సాయికుమార్ టీం షేర్ చేసిన శంబాల రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్స్, ఇలాంటి ప్రపంచాన్ని నిర్మించడం తొలిసారి.. స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, వీఎఫ్ఎక్స్ పార్ట్‌తో భారీగా స్థాయిలో రాబోతున్నాం.. అంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.
ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రాబోతున్న ఈ మూవీలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ మూవీకి శ్రీమ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు
Rajamouli | ‘అవతార్ 3’ ప్రమోషన్స్- రాజమౌళితో జేమ్స్ కామెరాన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
Kaantha | కాంత చిత్రానికి థియేటర్లలో ఫ్లాప్ టాక్.. కానీ ఓటీటీలో ఇంప్రెసివ్ రెస్పాన్స్
Tamannaah | క్రేజీ లైనప్.. మరో బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నా