Tamannaah | తెలుగు, తమిళం, హిందీతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది తమన్నా భాటియా. ఈ ఏడాది తెలుగులో ఓదెల 2 చిత్రంలో లీడ్ రోల్లో నటించిన తమన్నా.. హిందీ రైడ్ 2లో కామియో రోల్లో మెరిసింది. తాజాగా మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమన్నా.
షాహిద్ కపూర్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ఓ రోమియో చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీలో తృప్తి డిమ్రి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. విక్రాంత్ మస్సే, దిశా పటాని, నానా పటేకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు.
బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రం హిందీ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఓ రోమియో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ భామ ఖాతాలో ఇప్పటికే నాలుగు హిందీ సినిమాలుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది మిల్కీ బ్యూటీ.
Avatar 3 | ‘వారణాసి’ కోసం వెయిటింగ్.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్ స్పెషల్ ఇంటర్వ్యూ!
Akkineni Nagarjuna | మనుషులు శాశ్వతం కాదు.. మనం చేసే పనులు శాశ్వతం : అక్కినేని నాగార్జున
Kiran Kumar | టాలీవుడ్లో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత