అమరావతి : ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) బుధవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ( Diamond jubilee celebrations ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం అక్కినేని కుటుంబం తరుఫున రూ.2 కోట్లను అందజేశారు.
నాగార్జున మాట్లాడుతూ మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని అన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చారని పేర్కొన్నారు. 1959 సంవత్సరంలో రూ.లక్ష విరాళం అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండల్ల రాము,కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.