Indian Film Industry | భారత చలన చిత్ర పరిశ్రమ అంటే మొదటగా వినిపించే పేరు బాలీవుడ్ (Bollywood). ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషకు ప్రాముఖ్యం ఉన్న నేపథ్యంలో సాధారణంగా బీటౌన్ స్టార్ల క్రేజ్ ఎక్కువే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ యాక్టర్ల రేంజ్‌ను దక్షిణాది హీరోలు సులభంగా దాటేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్లలో బాలీవుడ్ హీరోలుండటం మామూలే.
కానీ సౌతిండియన్ (South indian film industry) సినిమాలు పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేస్తున్న నేపథ్యంలో తెలుగు, కన్నడ, తమిళ హీరోలు హిందీ స్టార్ యాక్టర్లను రెమ్యునరేషన్‌ను బీట్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ టాప్ 1లో నిలిచి తెలుగు సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పకనే చెబుతున్నాడు.
ఫోర్బ్స్ ఇండియా ప్రకారం 2024కు గాను టాప్ రెమ్యునరేషన్ పొందుతున్న టాప్ 10 భారతీయ నటుల్లో దక్షిణాది నుంచి ఎక్కువ మంది ఉండటం విశేషం. భారత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 10 యాక్టర్లపై ఓ లుక్కేస్తే..
ఫోర్బ్స్ ఇండియా ప్రకారం..
అల్లు అర్జున్ రూ.300 కోట్లు : పుష్ప 2 ది రూల్
విజయ్ రూ.130 కోట్లు – 275 కోట్లు : దళపతి 69 (రాబోయే), G.O.A.T, లియో
షారూఖ్ ఖాన్ రూ.150 కోట్లు – 250 కోట్లు : డుంకీ
రజనీకాంత్ రూ.125 కోట్లు – 270 కోట్లు : వెట్టైయాన్, జైలర్
అమీర్ ఖాన్ రూ.100 కోట్లు- 275 కోట్లు : లాల్ సింగ్ చద్దా
ప్రభాస్ రూ.100 కోట్లు- 200 కోట్లు : కల్కి 2898 AD
అజిత్ కుమార్ రూ.105 కోట్లు -165 కోట్లు : తునివు
సల్మాన్ ఖాన్ రూ.100 కోట్లు- 150 కోట్లు : టైగర్ 3
కమల్ హాసన్ రూ.100 కోట్లు- 150 కోట్లు : భారతీయుడు 2
అక్షయ్ కుమార్ రూ. 60 కోట్లు – 145కోట్లు : ఖేల్ ఖేల్ మే
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా