Mahesh babu | సినిమాలు అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో.. ఇండియా కంటే ఫారెన్‌లోనే ఎక్కువగా ఉంటున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందో లేదంటే ఇంకోసారి ఇంత టైం దొరుకుతుందో లేదో అని ముందే జాగ్రత్త పడుతున్నాడో తెలియదు కానీ.. ప్రతి పది రోజులకు ఒకసారి విదేశాలకు వెళుతున్నాడు మహేశ్. తాజాగా కూతురు సితార పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన మహేశ్ బాబు.. అంతలోనే కుటుంబంతో పాటు లండన్ వెళ్లిపోయాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో భార్యా పిల్లలతో కలిసి కనిపించాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో ఈ ఖాళీ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తున్నాడు మహేశ్ బాబు. సాధారణంగానే ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తుంటాడు ఈయన. ఇక ఇప్పుడు ఖాళీ టైం ఉండటంతో పూర్తిగా వాళ్లతోనే ఉంటున్నాడు సూపర్ స్టార్. త్రివిక్రమ్ సినిమా ఆగస్టులో మొదలుకానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అప్పటివరకు ఆయన లండన్ లోనే ఉంటాడని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన లండన్ వెళ్లడానికి కారణం ఆగస్టు 9న పుట్టినరోజు ఉండటమే.
కూతురు పుట్టిన రోజుతో పాటు.. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా లండన్ లోనే ప్లాన్ చేస్తున్నాడు మహేశ్. అందుకే అక్కడికి వెళ్లి 15 రోజులు ట్రిప్ తర్వాత ఇండియాకు తిరిగి రావాలని చూస్తున్నాడు. వచ్చి రాగానే త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు. ఇక రాజమౌళి సినిమా 2023 ఆగస్టు తర్వాత మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇంకా కథ కూడా ఫైనల్ చేయలేదు రాజమౌళి. ప్రస్తుతం అదే పనిపై బిజీగా ఉన్నాడు రైటర్ విజయేంద్రప్రసాద్. ఏదేమైనా ఖాళీ టైం దొరకడంతో మరోసారి విదేశాలకు వెళ్లిపోయాడు సూపర్ స్టార్.
“Mahesh Babu | మహేశ్‌కు మణిరత్నం సినిమాకు కనెక్షన్..ఇంతకీ ఏంటో..!”