టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్టార్ హీరో ఇక మరోవైపు నెక్ట్స్ ప్రాజెక్టు మొదలు పెట్టేలోపు కుటుంబంతో కలిసి యూరప్ చుట్టేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నెట్టింట్లో మహేశ్ వెకేషన్ టూర్ ఫొటోలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సూపర్ స్టార్ త్వరలోనే త్రివిక్రమ్ (Trivikram)తో చేయబోయే SSMB28ను షురూ చేయనున్నాడు. తాజా అప్ డేట్ ప్రకారం జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందీ ప్రాజెక్టు.
కాగా జులై రెండో పక్షంలో సినిమా షురూ కానుందట. ఈ సినిమా చిత్రీకరణ ఏ సీన్‌తో మొదలవబోతుందో తెలుసా..? మహేశ్ బాబుపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను ఓపెనింగ్ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారని లేటెస్ట్ టాక్. భారీ స్థాయిలో ఈ యాక్షన్ పార్టును ప్లాన్ చేస్తుండగా..సినిమాకు వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్‌గా నిలిచేలా ప్లాన్ చేశాడట మాటల మాంత్రికుడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మరోసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయనున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో లీడింగ్ లేడీగా కొనసాగుతున్న పూజాహెగ్డే హీరోయిన్గా కనిపించబోతుంది.
మహేశ్ బాబు మరోవైపు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)తో అడ్వెంచరస్ ప్రాజెక్టు కూడా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత జక్కన్న మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు మహేశ్. దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథాంశంతో రాజమౌళి సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్.
Read Also : Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్‌తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Also : Shahrukh Khan | రామోజీఫిలింసిటీలో షారుక్ ఖాన్..జోష్‌లో అభిమానులు
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్