Ramcharan | మెగా ప్రిన్సెస్ కు అంబానీ బంగారు ఊయల గిఫ్ట్.. స్పందించిన చరణ్ టీమ్
Ramcharan | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దంపతులు మెగా ప్రిన్సెస్ కోసం బంగారు ఊయల (Golden Cradle)ను కానుకగా పంపించారని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా చరణ్ టీమ్ (Ramcharan Team) స్పందించింది. బంగారు ఊయల వార్తలు అన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది.
Ramcharan | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా మెగా ప్రిన్సెస్ బారసాల శుక్రవారం మెగాస్టార్ చిరు ఇంట్లో వేడుకగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా భారత కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దంపతులు మెగా ప్రిన్సెస్ కోసం బంగారు ఊయల (Golden Cradle)ను కానుకగా పంపించారని ప్రచారం జరిగింది. అందులోనే పాప బారసాల వేడుకలు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా చరణ్ టీమ్ (Ramcharan Team) స్పందించింది. బంగారు ఊయల వార్తలు అన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రజ్వలా ఫౌండేషన్ (Prajwala Foundation) వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఊయలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
ఇటీవలే చరణ్-ఉప్సీ దంపతుల బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా చెక్క ఊయలను తయారు చేసి బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. ‘మీ (ప్రజ్వలా ఫౌండేషన్) నుంచి ఈ అద్భుత కానుకను అందుకోవడం ఎంతో గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. మీ చేతులతో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ధైర్యం, బలం, ఆత్మగౌరవం, ఆశకు ప్రతీక. మీరు పంపిన ఈ అద్భుత కానుక నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ అప్పట్లో రాసుకొచ్చింది.
Also Read..
France | తీవ్ర ఘర్షణల నడుమ.. రోడ్డు మధ్యలో తాపీగా శాండ్ విచ్ తిన్న యువకుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

