Titanic | టైటానిక్ శకలాలు చూడాలనుకునే వాళ్లకు ఓషియన్ గేట్ బంపర్ ఆఫర్.. వచ్చే ఏడాది రెండు ట్రిప్పులు!
Titanic submersible | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ (Titanic) నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి.. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగి పది రోజులు కూడా కాకముందే సంస్థ మరోసారి సాహస యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Titanic submersible | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ (Titanic) నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి.. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ సాహసయాత్రలో పేలిపోయిన టైటాన్ జలాంతర్గామి శకలాలు (wreckage) తీరాన్ని కూడా చేరాయి. ఇదిలా ఉండగా.. ఘటన జరిగి పది రోజులు కూడా కాకముందే సంస్థ మరోసారి సాహస యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానం అంటూ ఓషియన్ గేట్ (Oceangate) సంస్థ తాజాగా ప్రకటన ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది ఏకంగా రెండు ట్రిప్ లకు ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య ఒక ట్రిప్ ప్లాన్ చేయగా.. 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండో ట్రిప్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే, తాజా నిర్ణయంతో సంస్థ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇంతటి ఘోర విషాదం జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే మరోసారి సాహసయాత్ర అంటూ ప్రకటనలు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు. అంటే మన కరన్సీ ప్రకారం రూ.2కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.
Also Read..
Majid Ali | పాక్ అగ్రశ్రేణి స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య
Ramcharan | మెగా ప్రిన్సెస్ కు బంగారు ఊయల.. గిఫ్ట్ గా పంపిన అంబానీ దంపతులు
Uttar Pradesh | నోట్ల కట్టలతో భార్యా పిల్లలు సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ పోలీసు అధికారి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

