Ramcharan | మెగా ప్రిన్సెస్ కు బంగారు ఊయల.. గిఫ్ట్ గా పంపిన అంబానీ దంపతులు
Ramcharan | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా భారత కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దంపతులు మెగా ప్రిన్సెస్ కోసం అద్భుతమైన, అత్యంత ఖరీదైన బహుమతిని పంపినట్లు సమాచారం.
Ramcharan | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ (Mega Pricess) రాకతో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. కాగా, నేడు చిన్నారికి బారసాల కార్యక్రమం (Cradle Ceremony) నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా భారత కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దంపతులు మెగా ప్రిన్సెస్ కోసం అద్భుతమైన, అత్యంత ఖరీదైన బహుమతిని పంపినట్లు సమాచారం. రూ.1.20 కోట్లు విలువైన బంగారు ఊయలను (Golden Cradle) గిఫ్ట్ గా పంపినట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు రెండు కిలోలకు పైనే బంగారంతో దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారట. ఈ ఊయల్లోనే మెగా ప్రిన్సెస్ కు బారసాల కార్యక్రమం చేస్తారని తెలుస్తోంది.
కాగా, నేడు జరగబోయే బారసాల కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.
Also Read..
Uttar Pradesh | నోట్ల కట్టలతో భార్యా పిల్లలతో సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ పోలీసు అధికారి
Manipur Violence | మణిపూర్లో మళ్లీ హింస.. ఇంఫాల్ లో బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
Mexico | మెక్సికోలో దంచికొడుతున్న ఎండలు.. వడగాలులతో వంద మందికిపైగా మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

