Mexico | మెక్సికోలో దంచికొడుతున్న ఎండలు.. వడగాలులతో వంద మందికిపైగా మృతి
మెక్సికోలో (Mexico) ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యభగవానుడు ప్రతాపం చూపిస్తుండటంతో దేశంలోని చాలాచోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల (50 Degrees) ఉష్ణోగ్రత (temperatures) నమోదవుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలలు (Heat Wave) వీస్తుండటంతో ఇప్పటివరకు 100 మంది చనిపోయారని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మెక్సికో సిటీ: మెక్సికోలో (Mexico) ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యభగవానుడు ప్రతాపం చూపిస్తుండటంతో దేశంలోని చాలాచోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల (50 Degrees) ఉష్ణోగ్రత (temperatures) నమోదవుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలలు (Heat Wave) వీస్తుండటంతో ఇప్పటివరకు 100 మందికిపైగా చనిపోయారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. వారిలో జూన్ 18 నుంచి 24తో ముగిసిన వారంలోనే అత్యధికులు మృత్యువాతపడ్డారని వెల్లడించింది. అంతా హీట్ స్ట్రోక్తోనే (Heat stroke) చనిపోయారని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో ఎండల వల్ల ఒక్కరు మాత్రమే మరణించారని చెప్పింది.

కాగా, గత మూడువారాలుగా నమోదవుతున్న ఎండలతో విద్యుత్కు రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగిందని, దీంతో ఎనర్జీ గ్రిడ్ దెబ్బతిన్నదని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో సర్వీసులను నిలిపివేశామని చెప్పింది. సరోనా రాష్ట్రంలోని అకోంచీ పట్టణంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు వెల్లడించారు.

Mexico
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

