శర్వానంద్ ( Sharwanand ) టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న యాక్టర్లలో ఒకడు. ఈ యువ నటుడు ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆదివారం ఈ సినిమా షూటింగ్ లో సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్ (Radikaa Sarathkumar ), ఖుష్బూ, ఊర్వశి ఇతర యాక్టర్లు పాల్గొన్నారు. శర్వానంద్ తన ఇంటి నుంచి స్పెషల్ గా భోజనం తెప్పించి యాక్టర్లకు వడ్డించాడు.
ఈ విషయాన్ని రాధికా శరత్ కుమార్ షేర్ చేసుకున్నారు. సినిమా సెట్స్ లో చుట్టూ కూర్చోవడానికి వారంతా క్యారవాన్లను విడిచిపెట్టారు. శర్వానంద్ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఆహారాన్ని తిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. శర్వానంద్ ఫుడ్ తేగానే మేమంతా క్యారవాన్లను వదిలిపెట్టి చుట్టూ చేరాం. షూటింగ్ చాలా ఫన్ గా సాగిందని రాధికాశరత్ కుమార్ ట్వీట్ చేశారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Shootings are fun when hero @IamSharwanand brings food and all of us abandoning caravans to sit around and enjoy the camaraderie @khushsundar #oorvasi #aadavaallumeekujohaarlu pic.twitter.com/7lAZo3tQQV
— Radikaa Sarathkumar (@realradikaa) August 1, 2021
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..