వరుస సినిమాలను లైన్లో పెట్టిన టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని ప్రస్తుతం దసరా (Dasara) సినిమాపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు. డెబ్యూట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తోంది. నాని అండ్ శ్రీకాంత్ టీం ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని (Godavarikhani) లో షూటింగ్‌తో బిజీగా ఉందని ఇప్పటికే ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో సుమారు 500 మంది డ్యాన్సర్లతో ఓ పాటను షూట్ చేస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. గోదావరి ఖని ప్రజలు ఇపుడు షాక్ లో ఉన్నారట. చిన్న పట్టణమైన ఆ ప్రాంతంలో ఒక్క ఫంక్షన్ హాల్ కూడా ఖాళీగా లేకపోవడంతో ముక్కున వేలేసుకుంటున్నారట అక్కడి వాసులు. ఎందుకలా అంటే..జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు బస చేసేందుకు గోదావరి ఖనిలో ఎక్కువగా హోటల్స్ లేకపోవడంతో ప్రభుత్వ వసతి గృహాలు, కల్యాణ మండపాలతోపాటు ఇతర ప్రైవేట్ స్థలాలను కూడా బుక్ చేశారట ప్రొడక్షన్ టీం.
500 మందికి బస ఏర్పాటు చేయడం అంత ఖర్చుతో కూడుకున్నది కానప్పటికీ..ఇంత మందికి చిన్న ప్రాంతంలో అవసరమైన వసతి ఏర్పాటు చేయాలంటే కష్టమైన పనే. మొత్తానికి నాని తన టీంతో గోదావరిఖనిని ఆక్రమించేశాడని ఇపుడు ఇండస్ట్రీలో తెగ చర్చ నడుస్తోంది. చాలా కాలం తర్వాత నాని మళ్లీ తనలోని మాస్ ఇమేజ్ను బయటకు తీసేందుకు రెడీ అవుతున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెఱుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోదావరి ఖనిలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల గ్రామం నేపథ్యంలో దసరా వస్తోంది.