మరీ ఇంత పక్షపాతం పనికి రాదు సుకుమార్ గారు..!
సుకుమార్ | అల్లు అర్జున్ విషయంలో మాత్రం అప్ టు డేట్ అప్డేట్స్ అన్ని విడుదల చేస్తున్నాడు. కానీ రష్మిక మందనను పూర్తిగా మరిచిపోయారు.

అదేంటి.. సుకుమార్ ని పట్టుకొని అంత మాట అనేశారు.. అంత పక్షపాతం ఆయన ఎవరికి చూపించాడు.. ఎవరి మీద చూపించాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు మేం చెప్పేది వింటే ఈ స్టేట్మెంట్ నిజమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఈయన ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తి అయిపోయింది. కోవిడ్ కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు సుకుమార్. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయబోతున్నారు. ఆ రోజే అల్లు అర్జున్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ప్రీ టీజర్ దుమ్ము దులిపేసింది. రంగస్థలం తరహాలోనే ఈ సినిమా కూడా పూర్తిగా రివెంజ్ ఫార్మెట్‌లోనే తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. రష్మిక మందన విషయంలో మాత్రం సుకుమార్ వ్యవహరిస్తున్న తీరు ఆమె అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

సుకుమార్ అంతగా ఏం చేశాడు అనుకోవచ్చు.. వాళ్ల కోపానికి కారణం కూడా ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తున్న సుకుమార్ దానికి మూడు రోజుల ముందు పుట్టినరోజు జరుపుకున్న రష్మిక మందనను పూర్తిగా మరిచిపోయారు. ఆ రోజు పుష్ప సినిమా నుంచి రష్మిక మందన లుక్ వస్తుందని అభిమానులు ఎంతగానో వేచి చూశారు.

అదేరోజు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి రష్మిక లుక్ విడుదల చేశారు. కానీ సుకుమార్ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా విడుదల చేయలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం అప్ టు డేట్ అప్డేట్స్ అన్ని విడుదల చేస్తున్నాడు. ఇప్పటికైనా మీ సినిమాలో రష్మిక ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకొంది సుకుమార్ గారు.. మీకు మరీ ఇంత పక్షపాతం పనికిరాదు అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై పుష్ప యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతుంటే ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో హల్చల్
జల్సా సినిమా గుర్తు చేస్తున్న వకీల్ సాబ్ కొత్త పోస్టర్
వకీల్ సాబ్ ప్రమోషన్లో శృతి హాసన్ కనిపించడం లేదే..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
రష్మిక రిక్వెస్ట్..ఒకే చెప్పిన అల్లు అర్జున్
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
మళ్లీ ఏడిపించడానికి ఫిక్స్ అయిన శివ నిర్వాణ
విజయ్ ‘లైగర్’కు జాకీచాన్ యాక్షన్ డైరెక్టర్
విజయ్ దేవరకొండ కోసం పద్ధతులు మార్చుకున్న పూరీ జగన్నాథ్..
నటి హరితేజకు పండంటి పాపాయి
సుకుమార్ అసిస్టెంట్ స్టోరీకి మెగా హీరో ఇంప్రెస్..!
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
లాక్డౌన్ పెళ్లి వినోదాలు
పుష్పరాజ్ డబ్బింగ్ షురూ చేశాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

