మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej ) నటిస్తోన్న తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటి, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ ( Saiee Manjrekar ) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. గని ( Ghani ) షూటింగ్ తుది దశలో ఉంది. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయితే చిత్రీకరణకు శుభం కార్డు పడ్డట్టే.
గని క్లైమాక్స్ కోసం చాలానే కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్. జిమ్ లో సీరియస్ గా వర్కవుట్ చేస్తున్న వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. బ్యాక్ లుక్ లో తీసిన ఈ వీడియోలో వరుణ్ పుల్ అప్స్ తీస్తూ కనిపిస్తున్నాడు. హార్డ్ వర్క్ కు బ్యాక్ అప్ లుండవు అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గనిలో నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో కీ రోల్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా జార్జ్ సీ విలియమ్స్ ఫొటోగ్రఫీ. రెనాయ్సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.
No back-ups for hard work!🥊#Ghani#MondayMotivaton pic.twitter.com/XqXLlVXXnJ
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 2, 2021
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో