రంగ్ దే జోరుకు బ్రేకులు.. నితిన్‌కు ఇక కష్టమే
రంగ్ దే | ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.

నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి డైరెక్టన్లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాకు తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ముఖ్యంగా తొలి మూడు రోజుల్లో రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది నితిన్ సినిమా. నాలుగో రోజు హోలీ సెలవు రావడంతో కోటిన్నరకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.12.67 కోట్ల షేర్ వసూలు చేసింది రంగ్ దే.

ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్లకు చేరువలో షేర్ వచ్చింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.9 కోట్లు వసూలు చేయాలి. అలా చేస్తే కానీ నితిన్ హిట్ కొట్టలేడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాకు అన్ని కోట్లు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల రంగ్ దే కలెక్షన్స్ పడిపోయాయి. తొలి 4 రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి తగ్గుముఖం పట్టింది. వీకెండ్ అద్భుతంగా వర్కవుట్ చేస్తే తప్ప నితిన్ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లో రూ.22 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. అలాగే ఓవర్సీస్ రెస్టాఫ్ ఇండియా కలిసి మరో రెండున్నర కోట్ల బిజినెస్ చేసింది.

రూ.24 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగ్ దే.. ఈ 5 రోజుల్లో రూ.14.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఎలా చూసుకున్నా మరో రూ.9 కోట్లకు పైగానే బాకీ ఉన్నాడు నితిన్. పైగా ఈ వారం నాగార్జున వైల్డ్ డాగ్, కార్తి సుల్తాన్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా నితిన్‌కు మరిన్ని తిప్పలు తప్పవు. మొత్తానికి ఈ దిగ్బంధనం నుంచి నితిన్ ఎలా బయట పడతాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!
ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
నవీన్ కోసం స్లిమ్ కానంటున్న అనుష్క..!
దిల్ రాజు ఈజ్ బ్యాక్.. ఏం కాంబినేషన్స్ సామీ..!
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
రష్మికకు నాగార్జున ఛాలెంజ్.. వీడియో వైరల్
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌కు అనుమతి నిరాకరణ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

