తెలుగులో ఎవరూ ఊహించని స్థాయిలో బిగ్ బాస్ షో (Biggboss Show) సూపర్ సక్సెస్ అయింది. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హోస్టింగ్ చేస్తే..రెండో సీజన్ నాని (Nani) వచ్చాడు. ఇక మూడు నుంచి నాగార్జున (Nagarjuna) బాధ్యత తీసుకున్నాడు. సక్సెస్ ఫుల్ గా ఈయన మూడవ సీజన్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. ఈ షోపై వచ్చే విమర్శల సంగతి ఎలా ఉన్నా కూడా టిఆర్పీ రేటింగ్స్ పరంగా మాత్రం బిగ్ బాస్ దూసుకుపోతుంది. అప్పుడప్పుడు కింద పడినట్లు అనిపించినా.. మళ్ళీ వెంటనే పుంజుకుని మంచి టీఆర్పీ తీసుకొస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇది మొదలైనప్పుడు జబర్దస్త్ లాంటి క్రేజీ కామెడీ షో లకు కూడా రేటింగ్ తగ్గిపోతుంది.
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు (Meelo Evaru Koteeswarulu) షోపై బిగ్ బాస్ ప్రభావం భారీగానే పడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి జెమినీ టీవీలో ఈ ప్రోగ్రాం వస్తుంది. అయితే ఎన్టీఆర్ షో అయిపోయిన తర్వాత బిగ్బాస్ మొదలవుతుంది. ఈ రెండు ఎదురు పడటం అనేది జరగదు. ఎవరి దారి వాళ్ళది.. కానీ ఒక్కసారి రేటింగ్స్ బయటకు వచ్చిన తర్వాత ఏ షోకు ఎంత టిఆర్పీ వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. కచ్చితంగా అప్పుడు ఈ రెండు షోల మధ్య వ్యత్యాసం చూస్తారు అభిమానులు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఊహించిన రేటింగ్ అయితే రావడం లేదు. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ షో రేటింగ్స్ పరంగా నిరాశ పరిచిందనే ప్రచారం జరుగుతుంది. అత్యధికంగా 11 రేటింగ్ సాధించిన ఎవరు మీలో కోటీశ్వరులు.. ఆ తర్వాత 4కి పడిపోయింది. మరోవైపు బిగ్ బాస్ రేటింగ్స్ భారీగా వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున వీక్ డేస్ పోరు ఎలా ఉంటుందో చూడాలి. ఇది తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!