ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితకథ ఆధారంగా వస్తున్న సినిమా మేజర్. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా చేయడానికి ముందు సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితాన్ని తెలుసుకున్నాడు అడివి శేష్. ఆయన తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వారి అనుమతితో సినిమా చేస్తున్నాడు. ఇవాళ సందీప్ ఉన్నిక్రిష్ణన్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను అడివి శేష్ ట్విటర్ లో షేర్ చేశాడు.
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ. మేజర్ సినిమాలో మీ కొడుకు పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. మీరు, అంకుల్ నా జీవితంలో భాగమయ్యారు. అంటూ పోస్ట్ పెట్టాడు. మేజర్ షూటింగ్ చివరి దశలో ఉంది. దేశవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడి థియేటర్లు తెరుచుకున్న తర్వాత విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శోభితా ధూళిపాళ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.
Happy Birthday Aunty 🙂 I’m honoured to play your son in #MajorTheFilm
— Adivi Sesh (@AdiviSesh) July 15, 2021
Thank you for believing in me. For being there for me. No matter what, You and Uncle have me for life. #MajorSandeepUnnikrishnan pic.twitter.com/vDCsb0BD6d
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!