Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హార్రర్ కామెడీ జోనర్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. చాలా రోజుల తర్వాత తనలోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ చెప్పకనే చెబుతున్నాయి. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి.
రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మారుతి టీం అదిరిపోయే కానుకను రెడీ చేసింది. సింహాసనం ఖాళీగా లేదు. సింహానం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.. అంటూ రాజసం ఉట్టిపడేలా తలకిందులుగా ఉన్న సింహాసనం ఫొటోను షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడీ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ స్నీక్ పీక్ వరల్డ్ గ్లింప్స్ వీడియోను లాంచ్ చేయనున్నట్టు నిర్మాత ఎస్కేఎన్ హింట్ ఇచ్చేశారని తెలిసిందే. ఇక గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న సీన్లు అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
The throne isn’t empty…
It’s waiting for the man it belongs to 🔥𝐇𝐞’𝐬 𝐀𝐫𝐫𝐢𝐯𝐢𝐧𝐠 𝐓𝐨𝐦𝐨𝐫𝐫𝐨𝐰 👑#TheRajaSaabOnApril10th #TheRajaSaab #Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @SKNOnline… pic.twitter.com/ewj4RU1f5k
— BA Raju’s Team (@baraju_SuperHit) October 22, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్