Prabhas | ఆల్రెడీ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయనతో సినిమా చేయాలంటే కనీసం మరో మూడేండ్లు అయినా ఆగాల్సిందే. ఏ దర్శకుడికైనా కూడా ఇప్పుడు ఇదే అప్లై అవుతుంది. ఎందుకంటే మరో రెండు మూడు సంవత్సరాలకు సరిపోయే లైన్ సిద్ధంగా ఉంది. దానికి తోడు అందరూ పెద్ద డైరెక్టర్లు కావడంతో ప్రభాస్ సినిమాలపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కో సినిమాకు కనీసం 200 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాతో పాటు ప్రాజెక్టు కే సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. దాంతో పాటు మారుతి సినిమా కూడా సైలెంట్‌గా నడుస్తూనే ఉంది. ప్రస్తుతానికి ప్రభాస్ అమెరికాలో ఉన్నాడు. జూలై మొదటి వారంలో ఇండియాకు రాగానే మళ్లీ తన సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడు.
ఇదిలా ఉంటే ఈయన కోసం తాజాగా మరో ముగ్గురు దర్శకులు కథలు పట్టుకొని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్లు కూడా స్టార్ డైరెక్టర్స్ కావడం గమనార్హం.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాలో నేటివిటీ మిస్ అవుతుందని.. తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదని విమర్శలు ఎక్కువ అవుతున్న తరుణంలో.. ఈయన తర్వాత సినిమాలన్నీ తెలుగు దర్శకులకే ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ కోసం కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఒక కథ సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీన్ని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీగా నిర్మించాలని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు సుకుమార్ కూడా ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడు. ఇది పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది నిజాం కాలం నాటి కథతో ప్రభాస్‌తో ఒక సినిమా చేయాలని చాలా కాలం నుంచి సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా ఉంటుందని ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూడు సినిమాలు వర్కౌట్ కావడానికి ఎంతో సమయం పట్టదు.
ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కే, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా లైన్లో ఉంది. ఇవన్నీ పూర్తయ్యేసరికి కనీసం మరో రెండు ఏండ్లు పడుతుంది.
ఆ తర్వాతే కొత్త సినిమాల గురించి ఆలోచించనున్నాడు ప్రభాస్. కాకపోతే వరుస సినిమాలు చేస్తున్నా కూడా సరైన విజయం మాత్రం దక్కటం లేదు. మొన్న వచ్చిన ఆదిపురుష్ కూడా కమర్షియల్‌గా గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. దాంతో హిట్ కొట్టడం ప్రభాస్‌కు అనివార్యంగా మారింది.
Ramcharan | రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాపై ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్.. షూటింగ్ ఎప్పుడంటే..!