Asin | విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆసిన్..
Asin | తన భర్త రాహుల్ శర్మ (Rahul Sharma)తో నటి ఆసిన్ (Asin) విడాకులు తీసుకుంటోందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా గజినీ భామ స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
Asin | ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి ఆసిన్ (Asin). ఆ తర్వాత శివమణి, గజినీ, పోకిరి, దశావతారం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆసిన్.. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. హౌస్ ఫుల్ -2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786తో పాటు పలు చిత్రాల్లో నటించింది. కెరీర్ లో దూసుకెళ్తున్న సమయంలో 2016లో మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ (Rahul Sharma)ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలిచింది.
అందుకు కారణం.. ఆసిన్ తన ఇన్ స్టాగ్రామ్ లో భర్త ఫొటోలకు తొలగించడమే. దీంతో ఆమె విడాకులు తీసుకుంటోందంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. విడాకులు వార్తలు పలు వెబ్ సైట్లలో కూడా చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా గజినీ భామ స్పందించింది. అందులో నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ పుకార్లే అని తెలిపింది. భర్తతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేసింది.
‘ప్రస్తుతం మేం సమ్మర్ హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాం. ఉదయం ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో కొన్ని నిరాధారమైన వార్తలు మా కంటపడ్డాయి. వాటిని చూడగానే గతంలో మా పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. మేం విడిపోయాం అంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి కాస్త ఆలోచించి వార్తలు రాయండి. ఈ అద్భుతమైన హాలిడేలో దీని కోసం 5 నిమిషాల సమయం వృథా అయినందుకు నిరాశ చెందుతున్నా’ అంటూ ఆసిన్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Heavy rain warning | దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Ford Layoff | ఉద్యోగులకు షాకిచ్చిన ఫోర్డ్.. 3 వేల మందిపై వేటు..!
Iron Pillar | రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

