Ford Layoff | ఉద్యోగులకు షాకిచ్చిన ఫోర్డ్.. 3 వేల మందిపై వేటు..!
Ford Layoff | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ (Ford) తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించింది.
Ford Layoff | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగుల్ని తీసేశాయి (LayOff). ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి.
అయితే, ఇప్పటి దాకా ఐటీ, ఈ కామర్స్ సంస్థలు మాత్రమే ఉద్యోగులకు లేఆఫ్ లు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ (Ford) వచ్చి చేరింది. తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో అమెరికా (America), కెనడా (Canada)లోని సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. మొత్తం 3 వేల మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో రెండు వేల మంది సాధారణ సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని సమాచారం. తాజాగా లేఆఫ్స్ ప్రభావం అన్ని స్థాయిల్లో ఉన్న ఉద్యోగులపై పడనుంది. అయితే ఇందులో ఎక్కువగా ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నట్లు సమాచారం.
లేఆఫ్ లకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. మరోవైపు భారత్ సహా ఇతర దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ.. ఖర్చు తగ్గింపులో భాగంగా ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read..
Heavy rain warning | దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Iron Pillar | రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
cheetahs | కూనో నేషనల్ పార్క్లో చీతాల మధ్య ఘర్షణ.. అగ్నికి తీవ్ర గాయాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

