Bro Movie | పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కంప్లీట్.. బ్రో టీజర్ ఎప్పుడంటే?
Pawan kalyan | ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తెగ బిజీగా గడిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లలో పాల్గొంటూ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను ఫినీష్ చేసే దిశగా పరుగులు పెడుతున్నాడు.
Pawan kalyan | ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తెగ బిజీగా గడిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లలో పాల్గొంటూ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను ఫినీష్ చేసే దిశగా పరుగులు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ లైనప్‌లో ముందుగా రానుంది బ్రో మూవీ. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఓ రేంజ్లో హైప్ తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమా టీజర్‌ను కూడా గురవారం రిలీజ్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు సముద్రఖనితో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం పవన్ భీమవరంలో ఉన్నాడు. దాంతో బ్రో యూనిట్ స్వయంగా భీమవరంకు వచ్చి పవన్‌తో డబ్బింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక టీజర్‌కు సంబంధించిన అప్డేట్ ఈ రోజు సాయంత్రంలోపు వచ్చే చాన్స్ ఉంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
A ‘ROAR’ing Energy has added to the SWAG STORM 💥#BroTeaser Dubbing completed ✅
Announcement soon 📣
@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @SVR4446 @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth#BROFromJuly28 pic.twitter.com/iuIBlLxKJe— People Media Factory (@peoplemediafcy) June 28, 2023
తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

