అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ (Puspa : The Rule). రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా సీక్వెల్ పార్ట్‌లో మరికొంతమంది స్టార్ యాక్టర్లు జాయిన్ కాబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. పుష్ప 2లో టాలెంటెడ్ యాక్టర్ జగపతిబాబు కనిపించబోతున్నాడట. సుకుమార్ టీం ఇటీవలే హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. విశాఖపట్నంలో పది రోజుల పాటు భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం వైజాగ్ షెడ్యూల్ జనవరి 21 నుంచి షురూ కానుంది.
20 రోజులపాటు షిప్‌యార్డ్, పోర్టు ఏరియాలో వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేసిన తర్వాత బన్నీ టీం హైదరాబాద్ చేరుకోనుంది. అనంతరం మేజర్ షెడ్యూల్ షురూ చేయనుంది. అప్‌కమింగ్ షెడ్యూల్లో జగ్గూభాయ్ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే జగ్గూభాయ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టినట్టు టాక్ నడుస్తోంది. జగపతిబాబుకు సంబంధించిన ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ ఫస్ట్ పార్ట్‌ను మించి అత్యంత భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2కు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ కీ రోల్లో కనిపించనున్నాడు. పుష్ప2పై రానున్న రోజుల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రావడం ఖాయమనిపిస్తోంది.
Read Also : Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్‌కు గబ్బర్ సింగ్ ఫార్ములా.. మళ్లీ ట్రెండ్ సెట్ చేసేనా..?
Read Also : Rajinikanth | ఈ ఇద్దరిలో రజినీకాంత్‌ను ఇంప్రెస్ చేసేదెవరు..?
Read Also :Aparna Balamurali | అపర్ణ బాలమురళి పట్ల అభిమాని అత్యుత్సాహం.. నెటిజన్లు ఫైర్