Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్‌కు గబ్బర్ సింగ్ ఫార్ములా.. మళ్లీ ట్రెండ్ సెట్ చేసేనా..?
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ స్టార్ హీరో మరోవైపు హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) చేస్తున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ సినిమా తేరి రీమేక్ అని వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే పవన్ కల్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి ఈ సినిమా రీమేక్ అని చెప్పినా.. అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే డైరెక్టర్ హరీష్ శంకర్ టీం ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కల్యాణ్ లుక్స్ మార్చే పనిలో ఉన్నారని ఆనంద్ సాయి చెప్పారు.
హరీష్ శంకర్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రాన్ని తెలుగులో గబ్బర్ సింగ్‌గా తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. అయితే రీమేక్ వెర్షన్లో పవన్ కల్యాణ్ మ్యానరిజం, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చాలా మార్పులు చేశాడు. ఈ మార్పులు గబ్బర్ సింగ్ సక్సెస్‌లో కీ రోల్ పోషించాయి.
పవన్ కల్యాణ్‌కు గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చింది గబ్బర్ సింగ్. ఈ నేపథ్యంలో మరి ఉస్తాద్ భగత్ సింగ్‌లో మార్పులు చేస్తున్నారన్న అప్డేట్తో.. పవన్ కల్యాణ్ ను హరీష్ శంకర్ ఈ సారి ఎలా చూపించబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా చర్చించుకోవడం మొదలుపెట్టారు అభిమానులు.
Read Also :Aparna Balamurali | అపర్ణ బాలమురళి పట్ల అభిమాని అత్యుత్సాహం.. నెటిజన్లు ఫైర్
Read Also : Puspa : The Rule | పుష్ప 2లో స్టార్ యాక్టర్.. ప్రకటనే తరువాయి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

