Sharukh Khan | షారుఖ్ ఖాన్ క్రేజ్‌కు ఫిదా కావాల్సిందే.. పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎఫెక్ట్
పఠాన్ (Pathaan)..లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) అభిమానులు చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా పఠాన్ (Pathaan). లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
పరిమిత ప్రాంతాల్లో పఠాన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీ రిలీజ్‌కు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇప్పటివరకు లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. పీవీఆర్, ఐనాక్స్, సినీపొలీస్ సర్కిల్స్ లో టికెట్స్ అమ్మకాలు జరిగినట్టు ఇన్ సైడ్ టాక్.
ఓవర్సీస్లో కూడా భారీ స్థాయిలో పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. పూర్తిస్థాయిలో బుకింగ్స్ రేపటి నుంచి మొదలుకానున్నాయి. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం హైదరాబాద్‌లో కూడా అద్భుతంగా బుకింగ్ ట్రెండ్ కొనసాగుతుందట. షారుఖ్ ఖాన్‌కు సౌత్‌లో క్రేజ్ ఎలా ఉందో మరోసారి ఈ ఒక్క న్యూస్‌తో తెలిసిపోతుంది.
పఠాన్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దీపికా-షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా పఠాన్. ఇప్పటికే విడుదలైన పఠాన్ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ హాట్ టాపిక్‌గా మారింది.
పఠాన్ టీజర్ ..
Read Also : Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్‌కు గబ్బర్ సింగ్ ఫార్ములా.. మళ్లీ ట్రెండ్ సెట్ చేసేనా..?
Read Also :Aparna Balamurali | అపర్ణ బాలమురళి పట్ల అభిమాని అత్యుత్సాహం.. నెటిజన్లు ఫైర్
Read Also : Puspa : The Rule | పుష్ప 2లో స్టార్ యాక్టర్.. ప్రకటనే తరువాయి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

