Aparna Balamurali | అపర్ణ బాలమురళి పట్ల అభిమాని అత్యుత్సాహం.. నెటిజన్లు ఫైర్
ఇష్టమైన యాక్టర్లను కలిసినపుడు కొందరు ఫ్యాన్స్ ఆనందంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. అలాంటిదే ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. టాలెంటెడ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali)తమిళనాడులో జరిగిన ఓ కాలేజ్ ఈవెంట్‌కు హాజరైంది.
తమ ఫేవరేట్ యాక్టర్ల మీదున్న అభిమానాన్ని చూపించే క్రమంలో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారని తెలిసిందే. ఇష్టమైన యాక్టర్లను కలిసినపుడు ఆనందంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. అలాంటిదే ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. టాలెంటెడ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali) తమిళనాడులో జరిగిన ఓ కాలేజ్ ఈవెంట్‌కు హాజరైంది.
అయితే ఓ అభిమాని స్టేజీపై ఉన్న అపర్ణకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆమె భుజంపై చేయి వేసి కెమెరాకు ఫోజులిచ్చేందుకు ప్రయత్నించాడు. అభిమాని చేష్టలతో ఇబ్బందికరంగా ఫీలైన అపర్ణ అతని నుంచి మెల్లగా తప్పించుకుంది. ఈ వీడియో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మంజిమా మోహన్ ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ.. నమ్మశక్యంగా లేదు.. అసహ్యకరంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అభిమాని ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశం నీ హద్దురా సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అపర్ణ బాలమురళి. ఈ భామ ప్రస్తుతం మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ధూమమ్తోపాటు మరో ఐదు సినిమాలు చేస్తుండగా.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
అభిమాని ఓవరాక్షన్.. వీడియో
Unbelievable and disgusting! https://t.co/Ls4y06QrVx
— Manjima Mohan (@mohan_manjima) January 19, 2023
Read Also : Rajinikanth | ఈ ఇద్దరిలో రజినీకాంత్‌ను ఇంప్రెస్ చేసేదెవరు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

