Rajinikanth | ఈ ఇద్దరిలో రజినీకాంత్‌ను ఇంప్రెస్ చేసేదెవరు..?
రజినీకాంత్ (Rajinikanth) 169వ ప్రాజెక్ట్ గా వస్తున్న జైలర్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ లాల్, సునిల్, తమన్నా లుక్స్ విడుదల కాగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. 169వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ లాల్, సునిల్, తమన్నా లుక్స్ విడుదల కాగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సినిమా పూర్తవకముందే తలైవాకు సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
రజినీకాంత్ తన 170వ (170th project) సినిమా కోసం ఇద్దరు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రజినీ ఇటీవలే లవ్ టుడే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel)ను కలిశాడు. ఈ ఇద్దరు డైరెక్టర్లు చెప్పిన స్టోరీలైన్స్ రజినీకాంత్‌ను ఇంప్రెస్ చేయగా.. ఫైనల్ స్క్రిప్ట్‌తో రావాలని డైరెక్టర్లకు సూచించాడట. టీజే జ్ఞానవేళ్ సోషల్ డ్రామా నేపథ్యంలో సాగే కథను రజినీకాంత్‌కు వినిపించాడని వార్తలు వస్తున్నాయి.
ఓ వైపు జూనియర్ డైరెక్టర్, మరోవైపు సీనియర్ డైరెక్టర్.. ఈ ఇద్దరిలో తలైవాను ఫైనల్‌గా ఎవరు ఇంప్రెస్ చేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. గతేడాది ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన యూత్‌ఫుల్ ట్రాక్ లవ్ టుడే బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని తెలిసిందే.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023
Read Also : Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్‌కు గబ్బర్ సింగ్ ఫార్ములా.. మళ్లీ ట్రెండ్ సెట్ చేసేనా..?
Read Also :Aparna Balamurali | అపర్ణ బాలమురళి పట్ల అభిమాని అత్యుత్సాహం.. నెటిజన్లు ఫైర్
Read Also : Puspa : The Rule | పుష్ప 2లో స్టార్ యాక్టర్.. ప్రకటనే తరువాయి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

