Naga Vamsi | సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కి్స్తూ టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ నిర్మాత కాంపౌండ్ నుంచి నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్లో వస్తోన్న చిత్రం ఎన్బీకే 109 (NBK109). బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ఈవెంట్లో నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా చిత్ర నిర్మాతలు విడుదల తేదీని నిర్ణయించేటప్పుడు పోటీ, సీజన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ మీ సినిమాల విషయానికొస్తే మీ పోటీదారులు సింపతీ (సానుభూతి) కార్డు వాడారు. జనవరిలో.. ఇప్పుడు దీపావళిలో అలానే జరిగిందని ఓ రిపోర్టర్ చెప్పుకొచ్చాడు. దీనిపై నాగవంశీ ఆ రెండు సినిమాలకు కంటెంట్ కంటే సింపతీనే బాగా పనిచేసిందని చెప్పాలా..? అని బదులిచ్చాడు.
నాకు పోటీగా విడుదలవుతున్న సినిమాలే సింపతి కార్డు వినియోగిస్తూ నాకు షాక్ ఇస్తున్నాయి. నా సినిమాలతో పోటీపడుతున్నప్పుడు దర్శకనిర్మాతలు తమ కష్టాల గురించి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు. నా సినిమాలు రిలీజవుతున్నప్పుడే ఇలా చేస్తున్నారు. మనం కూడా డాకు మహారాజ్ కోసం సింపతి కార్డు ప్లే చేసేందుకు ప్రయత్నించాలంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు నాగవంశీ .
The Rana Daggubati Show | నాకు ఏం తెలియదు.. ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ వచ్చేసింది
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ
డాకు మహారాజ్ టైటిల్ టీజర్..