e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 29, 2021
Home News Dussehra Movies 2021 | ఈ మూడు సినిమాల‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..?

Dussehra Movies 2021 | ఈ మూడు సినిమాల‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..?

పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ ద‌స‌రా (Dussehra Movies) బరి నుంచి త‌ప్పుకోవ‌డంతో చాలా సినిమాల‌కు ఉప‌శ‌మ‌నం దొరికిన‌ట్టయింది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. సెకండ్ వేవ్ త‌ర్వాత భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాగా ల‌వ్‌స్టోరీ నిలిచింది. ల‌వ్ స్టోరీ సినిమాతో థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాల‌కు మ‌ళ్లీ ఆద‌ర‌ణ మొద‌లైన‌ట్టేన‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదే న‌మ్మ‌కంతో మాధ్య‌మిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్రాలు ద‌స‌రా పోటీలో నిలుస్తున్నాయి.

ఈ ద‌స‌రా సంద‌ర్భంగా అఖిల్, పూజాహెగ్డే కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ (Most Eligible Bachelor), సిద్దార్థ్‌, శ‌ర్వానంద్ హీరోలుగా న‌టిస్తున్న మ‌హా స‌ముద్రం (Mahasamudram), శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టిస్తున్న పెళ్లి సంద‌D (Pelli SandaD) థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి. తాజాగా ట్రేడ్ పండితులు ఈ మూడు సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ అంచ‌నాకు వ‌చ్చినట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ టాక్‌. ఈ మూడు చిత్రాలు రూ.45 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేశాయ‌ని తాజా అంచ‌నా.

- Advertisement -

ఇప్ప‌టికే విడుద‌లైన మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. మ‌రోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ తో స‌క్సెస్ కొట్టాల‌ని క‌సిగా ఉన్నాడు అఖిల్‌. కే రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న పెళ్లి సంద‌Dపై కూడా అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌రి ఈ మూడు సినిమాలు బాక్సాపీస్ ను ఎలా షేక్ చేస్తాయో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

ఇది కూడా చూడండి


Akhil Akkineni | గత ప‌దేళ్ల నుంచి త‌న‌కిష్ట‌మైన ఫొటో చూపించిన అఖిల్‌

Rowdy Boys | క‌ల‌ర్‌ఫుల్ పాట‌తో చిత్రీక‌ర‌ణ పూర్తి

Jacqueline Fernandez | ‘నీలిరంగు చీర‌లోనా..సంద‌మామా నీవే జాణ‌’

Sunny Leone | స్వ‌ర్గంలో ఏంజెల్‌లా స‌న్నీలియోన్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement