టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశిష్ (Ashish Reddy) హీరోగా పరిచయమవుతున్న చిత్రం రౌడీ బాయ్స్ (Rowdy Boys). హుషారు ఫేం హర్ష కొనుగంటి (Harsha Konuganti) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవలే కాలేజ్ డేట్ నైట్ పాటను చిత్రీకరించింది హర్ష అండ్ టీం. కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jaani Master) నేతృత్వంలో కలర్ ఫుల్‌గా సాగే పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది.
పాట షూట్ లొకేషన్లో జానీ, ఆశిష్, దిల్ రాజు, డైరెక్టర్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Tollywood) కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజ్, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మధీ ఐఎస్సీ కెమెరా వర్క్ చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. యూత్‌ఫుల్ స్టోరీతో తెరకెక్కుతున్న రౌడీ బాయ్స్ రషెస్ కు మంచి స్పందన వస్తోంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్