Toxic | కేజీఎఫ్ ప్రాంఛైజీతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash). ఈ బ్లాక్ బస్టర్ ప్రాంఛైజీ తర్వాత యశ్ నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ (Toxic). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా నుంచి ఏదైనా కొత్త వార్త వస్తుందేమోనని ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా కథనాల ప్రకారం ప్రస్తుతం టాక్సిక్ మూవీ గోవా షెడ్యూల్ ముగిసింది. ఈ షూట్ తర్వాత నెక్ట్స్ ఇవాళ బెంగళూరు షెడ్యూల్ మొదలైంది. టౌన్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో చిత్రీకరణ కొనసాగనుంది. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, తారాసుటారియాపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని మాలీవుడ్ సర్కిల్ సమాచారం. ఇంకేంటి ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు యశ్ అభిమానులు.
బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా సాగనుండగా..కథానుగుణంగా బెంగళూరు, శ్రీలంకలో టాక్సిక్ షూటింగ్ కొనసాగించనున్నట్టు ఇన్సైడ్ టాక్. కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్టు తర్వాత యశ్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. వింటేజ్ టాక్సీ, రౌండప్ క్యాప్ పెట్టుకున్న యశ్ ప్రీ లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
After wrapping up the Goa schedule, the #Toxic movie next schedule began in Bengaluru on a special set. The shoot now features #Nayanthara, #KiaraAdvani, #HumaQureshi, and #TaraSutaria in action! #Yash #GeethuMohandas #ToxicMovie pic.twitter.com/nUmD2skRxi
— The Cine Gossips (@TheCineGossips) February 4, 2025
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?