Liger | నిర్మాత, పంపిణీదారుడు మధ్య అనుబంధం బాగున్నంత కాలం ఫర్వాలేదు. హిట్ సినిమాలు నిర్మాత తీసినంత కాలం, ఆ సినిమాను పంపిణి చేసి లాభాలు పొందిన కాలం ఇద్దరూ బాగానే వుంటారు. ఇక ఎన్నో ఆశలతో.. అంచనాలతో విడుదల కాబోతున్న సినిమాను ఓ పంపిణీదారుడు అత్యధిక అమౌంట్‌ను పే చేసి తీసుకుంటే.. ఆ సినిమా ఫ్లాప్ అయితే అసలు కష్టాలు అక్కడే మొదలవుతాయి. ఇక విషయానికొస్తే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ (puri jagannath) కలయికలో రూపొందిన పాన్ ఇండియా సినిమా లైగర్ (Liger) . ఎన్నో అంచనాలతో.. ఎంతో బజ్‌తో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే ఈ చిత్రం దక్షిణాది పంపిణీ హక్కులను పంపిణీదారుడు వరంగల్ శ్రీను 55 కోట్లకు చేజిక్కుంచుకున్నాడు. అన్ని భాషల హక్కులను అమ్మేసి నైజాం హక్కులన మాత్రం తన దగ్గరే వుంచుకుని సొంతంగా విడుదల చేశాడు. అయితే ఎవరి ఊహించని విధంగా లైగర్ అత్యంత ఘోర పరాజయం కావడంతో వరంగల్ శ్రీను నైజాం ఏరియాలో 18 కోట్లు లాస్ అయ్యాడు. దీంతో ఎన్ఆర్ఐ బేస్‌లో ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్న వరంగల్ శ్రీను తన లాస్ ఎమౌంట్ ఇవ్వాలని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. చాలా కాలం పాటు పూరి ఆఫీసు చుట్టు తిరిగాడు.
అయితే ఫలితం లేదు. అంతేకాదు ఫిల్మ్‌చాంబర్ దగ్గర మిగతా పంపిణీదారులతో కలిసి ధర్నాకు దిగాడు. అయినా ఎవరూ పట్టించుకులేదు. లైగర్ చిత్రాన్ని పూరి తన సొంత బ్యానర్లో ఛార్మికౌర్‌తో కలిసి నిర్మించాడు. కాగా లైగర్ పాత వివాదం మళ్లీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ విడుదల కాబోతున్నందున తన పాత బాకీ చెల్లించామని మళ్లీ వరంగల్ శ్రీను ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించగా.. లైగర్ నైజాం లాస్ అమౌంట్‌ను పూరి జగన్నాథ్ కట్టాల్సిన పనిలేదని ఛాంబర్ పూరి కనెక్ట్స్‌కు రాతపూర్వకంగా లెటర్ ఇచ్చేసింది. సొ.. ఇక వరంగల్ శ్రీను లైగర్ లాస్ అమౌంట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే!
Magadheera | రాంచరణ్ ల్యాండ్ మార్క్ మూవీ మగధీర @ 15 ఇయర్స్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు