హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా హాస్పిటల్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మొదటి ఫేజ్‌లో సుమారు రూ.13వేల కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర హ్యామ్ రోడ్ల పనులు, 34 ప్యాకేజీల్లో చేపట్టనున్నట్టు వివరించారు. ఈ నెలలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభించున్నట్టు తెలిపారు. 6న కరీంనగర్లో చేపట్టే హ్యా మ్, సీఆర్ఎఫ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు.