హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక కోరారు. 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, వోన్ సోర్స్ రెవెన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్షాప్లో మంత్రి సీతక తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరుగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్రం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వల్ల అకడి ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.