The Greatest Of All Time | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ (Thalapathy Vijay) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల తేదీన ఉదయం 4 గంటలకు షోలు ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇది అభిమానులకు గుడ్ న్యూస్ అయినప్పటికీ.. దీనికి సంబంధించి మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, వీటీవీ గణేశ్, అజ్మల్ అమీర్, మనోబాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Nani 32 | నాని 32 అనౌన్స్మెంట్ డేట్ ఫైనల్.. ఇంతకీ ఏ సినిమానో మరి..?
Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లు ఓటీటీ, టీవీలో సందడి చేసే టైం ఫిక్స్..!