Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకోగా.. రూ.3.6 కోట్ల భారీ మొత్తానికి రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ ఫిగర్ వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా కోసం డిజైన్ చేసిన 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్‌కు సంబంధించి స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Mega Prince @IamVarunTej‘s #MATKA creates a splash of its audio rights with a record-breaking price💥
This much anticipated film sells its audio rights for a whopping 3.6 crores to @adityamusic 👌
The most talented @gvprakash is set to weave his musical magic 🎹
A @KKfilmmaker… pic.twitter.com/9D24cj8cYZ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 3, 2024
Prasanth Varma | హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సస్పెన్స్.. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో ..?
Venkat Prabhu | ది గోట్ సినిమాకు తలైవా, ధనుష్ ఫస్ట్ చాయిస్ అట.. వెంకట్ ప్రభు ఏమన్నాడంటే..?
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్