Viswam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం విశ్వం (Viswam). Gopichand 32గా వస్తోన్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్‌ను లాంచ్ చేశారు. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో హీరోయిన్ చెప్పే సంభాషణలతో మొదలైంది టీజర్.
నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్‌తోపాటు షకలక శంకర్, అజయ్ ఘోష్ కాంబోలో సాగే కామింగ్ టైమింగ్ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని విశ్వం టీజర్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే జర్నీ ఆఫ్ విశ్వం అంటూ షేర్ చేసిన వీడియోలో ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ.. ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండటానికి కారణం మోసం. నేరాల్లో ఐదో స్థానంలో ఉండటానికి కారణం మోసం.. నేనిక్కడుండటానికి కారణం మోసం అంటూ ఫన్నీ మ్యానర్‌లో సాగుతున్న సంభాషణలు శ్రీనువైట్ల మార్క్‌తో ఇంప్రెసివ్‌గా సాగుతున్నాయి.
ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తెరకెక్కిస్తు్న్నారు. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అని ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోంది. గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#Viswam is everything you wish for – action, emotion, comedy and tons of entertainment 💥💥💥#ViswamTeaser out on now ❤🔥
▶️ https://t.co/6ozu2IwHQGGRAND RELEASE WORLDWIDE ON OCTOBER 11th 💥💥
Macho star @YoursGopichand @SreenuVaitla @KavyaThapar @vishwaprasadtg… pic.twitter.com/WSncVp1BVF
— People Media Factory (@peoplemediafcy) September 3, 2024
విశ్వం టీజర్..
Matka | కెరీర్లోనే టాప్.. వరుణ్ తేజ్ మట్కా ఆడియో రైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
Trivikram srinivas | వరద బాధితుల కోసం త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబు భారీ విరాళం
Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లు ఓటీటీ, టీవీలో సందడి చేసే టైం ఫిక్స్..!
Venkat Prabhu | ది గోట్ సినిమాకు తలైవా, ధనుష్ ఫస్ట్ చాయిస్ అట.. వెంకట్ ప్రభు ఏమన్నాడంటే..?