సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్హెడ్(87 బంతుల్లో 91 నాటౌట్, 15ఫోర్లు) ధనాధన్ అర్ధసెంచరీతో విజృంభించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ పరుగుల వరద పారించాడు. టీ20లను తలపిస్తూ తక్కువ బంతుల్లోనే స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 211/3తో రెండో రోజు సోమవారం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జోరూట్(160) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.ఈ క్రమంలో టెస్టుల్లో 41వ సెంచరీ చేశాడు.