ముంబై: విజయ్ హజారే వన్డే టోర్నీలో ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో ముంబై సారథిగా అయ్యర్ కొనసాగుతాడని ఎమ్సీఏ సోమవారం పేర్కొంది.
కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ పూర్తి స్థాయి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే..అయ్యర్‌కు టీమ్ ఇండియా లో చోటు దక్కనుంది.