దుబాయ్: ఐఎల్టీ20 చాంపియన్‌షిప్‌లో డిసర్ట్ వైపర్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన టోర్నీలో డిసర్ట్ వైపర్స్ 46 పరుగుల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత కెప్టెన్ సామ్ కరన్(51 బంతుల్లో 74 నాటౌట్, 8ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధషెంచరీతో వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182/4 స్కోరు చేసింది. కరన్‌కు తోడు మ్యాక్స్ హోల్డెన్(41), డాన్ లారెన్స్(23) రాణించడంతో వైపర్స్ గౌరవప్రదమైన స్కోరు అందుకుంది.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఎమిరేట్స్..136 పరుగులకే పరిమితమైంది. నసీమ్షా(3/18)కు తో డేవిడ్ పైన్(3/42) ధాటికి ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే పూర్తయ్యే లోపే ముంబై 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ షకీబల్‌హసన్(36) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.