కోల్‌కతా: భారత మాజీ స్నూకర్ ప్లేయర్ మనోజ్ కొఠారీ కన్నుమూశారు. సోమవారం తిరునల్వేలి(తమిళనాడు)లోని దవాఖానలో తీవ్రమైన గుండెపోటుతో కొఠారీ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం లివర్ ట్రాన్‌ప్లాంట్ జరుగగా, దాన్నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఉదయం వచ్చిన గుండెపోటుతో 67ఏండ్ల మనోజ్ తుదిశాస్వ విడిచినట్లు వారు తెలిపారు.
1990లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచిన మనోజ్‌కు భార్యతో పాటు కొడుకు సౌరవ్ కొఠారీ ఉన్నారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ సౌరవ్ బిలియర్డ్స్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. మనోజ్ మెంటార్షిప్తో గతేడాది సౌరవ్ వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ విజేతగా నిలిచాడు.