Nani 32 | ఇటీవలే సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని (Nani). ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నాని నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఆ అప్డేట్ రానే వచ్చింది. నాని 32వ ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్ 5న ఉదయం 11:04 గంటలకు లాంచ్ చేయబోతున్నారు.
నాని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా ఈ ప్రకటన ఉండబోతుంది. మరి ఇంతకీ నాని చేయబోతున్న నెక్ట్స్ సినిమా శైలేష్ కొలను డైరెక్షన్లో రాబోతున్న హిట్ 3నా.. లేదంటే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మూవీనా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
స్టీరింగ్‌పై రక్తపు మరకలున్న నాని హ్యాండ్‌తో రిలీజ్ చేసిన అప్డేట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలా ఉంటే తన తర్వాతి సినిమా చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పి.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు నాని.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం వరల్డ్‌వైడ్‌గా రూ.75 కోట్లు రాబట్టింది. ఈ వీకెండ్ కల్లా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా ముందుకెళ్తోంది.
#Nani32 announcement on Sept 5th at 11:04AM✅#16YearsofNaniInTFI | #Nani pic.twitter.com/8aWTeFlIKn
— Tharani ᖇᵗк (@iam_Tharani) September 3, 2024
Matka | కెరీర్లోనే టాప్.. వరుణ్ తేజ్ మట్కా ఆడియో రైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
Trivikram srinivas | వరద బాధితుల కోసం త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబు భారీ విరాళం
Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లు ఓటీటీ, టీవీలో సందడి చేసే టైం ఫిక్స్..!
Venkat Prabhu | ది గోట్ సినిమాకు తలైవా, ధనుష్ ఫస్ట్ చాయిస్ అట.. వెంకట్ ప్రభు ఏమన్నాడంటే..?