=The Goat Life | కథను నమ్మి సినిమాలు చేసే స్టార్ హీరోల్లో ఒకడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ది గోట్ లైఫ్ (The Goat Life). వాస్తవ సంఘటనల స్పూర్తితో బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ మలయాళంలో The Goat Life టైటిల్‌తో గ్రాండ్‌గా విడుదల కాగా.. తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో రిలీజైంది.
సర్వైవల్ డ్రామా నేపథ్యంలో మార్చి 28న ఈ చిత్రం విడుదల కాగా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫాంకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ రానే వచ్చింది. నాలుగు నెలల థ్రియాట్రికల్ రిలీజ్ తర్వాత ఫైనల్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి.
బ్లెస్సీ కథనందిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అత్యంత వేగంగా వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్లు సాధించిన మలయాళ సినిమాగా కూడా అరుదైన రికార్డు The Goat Life ఖాతాలో ఉందని తెలిసిందే. ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా తెరకెక్కించాయి.
#Aadujeevitham #TheGoatLife Streaming from 19/07/2024 on #Netflix @Netflix_INSouth pic.twitter.com/J0WYpOQtKs
— Prithviraj Sukumaran (@PrithviOfficial) July 18, 2024
Oru manushyan thande veetilott madangiyethaan ethra dooram vare pokum?
Watch #Aadujeevitham to find out, now on Netflix in Malayalam, Tamil, Telugu, Kannada, Hindi#AadujeevithamOnNetflix pic.twitter.com/Iv1BJWoP4B
— Netflix India South (@Netflix_INSouth) July 18, 2024
Maharaja | తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ సేతుపతి మహారాజ అరుదైన ఫీట్
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Double iSmart | బాలీవుడ్లో రామ్ టీం డబుల్ ఇస్మార్ట్ ప్లాన్
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ