Maharaja | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలు చాలా ఉన్నాయని తెలిసిందే. ఈ జాబితాలో నిలిచిపోతుంది మహారాజ (Maharaja). Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వచ్చిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి జులై 12న డిజిటల్ డెబ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.
నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. ఈ చిత్రం తాజా నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రికార్డు అఛీవ్మెంట్ అని చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ అన్ని వెర్షన్లలో రికార్డ్స్ సృష్టిస్తూ ఇండియాలో మొదటి నుంచి నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మహారాజ నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, సచనా నిమిదాస్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి కీలక పాత్రల్లో నటించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
కేకే నగర్లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తిగా కనిపించే విజయ్‌సేతుపతి.. తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్ అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరో సస్పెన్స్‌లో పెడుతూ సాగుతున్న సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Dhanush | నిప్పులాంటి నిరుద్యోగి.. ధనుష్ ల్యాండ్ మార్క్ సినిమా వీఐపీకి పదేళ్లు..
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ