Dhanush | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న తమిళ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు ధనుష్ (Dhanush). పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఈ టాలెంటెడ్ యాక్టర్ కెరీర్లో సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీటిలో ఒక ల్యాండ్ మార్క్ సినిమా వీఐపీ (VIP). తెలుగులో రఘువరన్ బీటెక్ టైటిల్‌తో విడుదల కానుంది. ధనుష్ 25వ సినిమాగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపించింది.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ గురు (ధనుష్) ఉద్యోగం కోసం కంపెనీలకు ఇంటర్వ్యూకు వెళ్లగా.. అనుభవం లేదని తిరస్కరిస్తుంటారు. సొంత టాలెంట్‌తో ఎంతోమంది నిరుద్యోగులకు ఎలా ఆదర్శంగా నిలిచాడనే నేపథ్యంలో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో సాగే ఈ సినిమాకు అన్ని వర్గాల ఇంప్రెషన్ కొట్టేసింది. ఈ చిత్రం నేటితో విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ షేర్ చేసుకున్నాడు ధనుష్.
ఈ సినిమాతో డీవోపీ వెల్రాజ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. వీఐపీ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు ఆల్‌టైమ్ సూపర్ హిట్స్‌గా నిలిచాయి.
10 years of VIP .. ♥️♥️ pic.twitter.com/m15Mneo2VO
— Dhanush (@dhanushkraja) July 18, 2024
10 Years Of #VIP ⭐
• All Time Favorite Film in The Dhanush Filmography🔥
• 25th Film At it’s Best For The Performer #Dhanush 😎
• G.O.A.T #Anirudh Songs Are The Album BlockBuster❤️🔥
• DOP #Velraj Debut Film As The Director Aswell!!#10YearsOfVIP ✨ pic.twitter.com/TngvZuqvNa— Saloon Kada Shanmugam (@saloon_kada) July 18, 2024
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్