Shivam Bhaje | టాలీవుడ్ యాక్టర్ అశ్విన్ బాబు (Ashwin Babu) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ శివం భజే (Shivam Bhaje). అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీ రోల్ పోషిస్తున్నాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదల చేసిన లుక్ ఒకటి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
భయానకంగా ఉన్న కన్ను లుక్ కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో ఇండియా మ్యాప్ ఉన్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కనిపించేదంతా మున్నేత్రుడి మర్మమే అంటూ ఈ మూవీ నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్ విడుదల చేశారు మేకర్స్. గూస్బంప్స్ తెప్పించేలా సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా కామెడీ, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ మూవీలో హైపర్ ఆది, సాయిధీన, తులసి, దేవిప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర కెమెరామెన్ కాగా.. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.
కనిపించేదంతా మున్నేత్రుడి మర్మమే 🔱
Walk into his divine trance with #RamRamEeswaram 💥
▶️ https://t.co/xI9j1GGZyf#రంరంఈశ్వరం #ShivamBhaje@imashwinbabu #ShivamBhajeOnAUG1st pic.twitter.com/GLR8njtUt3
— BA Raju’s Team (@baraju_SuperHit) July 18, 2024
Music Shop Murthy | ఓటీటీలో ఇంప్రెసివ్‌గా అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి
Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్