Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్
Sai Pallavi | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవలే ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అందర్నీ వెనక్కినెట్టి మరో ఫిల్మ్‌ఫేర్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాయిపల్లవికి అభినందనలు తెలియజేస్తూ.. ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Sai Pallavi | తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది సాయిపల్లవి (Sai Pallavi) . బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇటీవలే ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అందర్నీ వెనక్కినెట్టి మరో ఫిల్మ్‌ఫేర్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. 2022 సంవత్సరానికిగాను విరాటపర్వం, గార్గి (2023 తమిళం) సినిమాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ని అందుకోనున్నది.
ఈ సందర్భంగా సాయిపల్లవికి అభినందనలు తెలియజేస్తూ.. ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తండేల్ సెట్స్‌లో సాయిపల్లవితో కేక్ కట్ చేయించింది అల్లు అరవింద్ టీం. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా ‘ప్రేమమ్’, తొలి తెలుగు సినిమా ‘ఫిదా’, శ్యామ్‌సింగరాయ్, లవ్‌స్టోరీ సినిమాలకుగాను ఫిల్మ్ఫేర్లు అందుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు మరోసారి ఫిల్మ్‌ఫేర్ అందుకోబోతూ అరుదైన రికార్డును సృష్టించింది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. సాయిపల్లవి సత్య పాత్రలో కనిపించనుంది.
Team #Thandel celebrated the twin wins of @Sai_Pallavi92 at the Filmfare Awards on the sets of the film ❤️🔥
‘Satya’ from #Thandel will be another memorable role from the talented actor ✨#Dhullakotteyala 💥💥
Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP @GeethaArts… pic.twitter.com/4qdrMUtaqH
— Geetha Arts (@GeethaArts) July 17, 2024
Read Also :
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

